↧
పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో పవర్ కట్ చేశారు. వరుస పేలుళ్లతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.