↧
ముంబై బాంబు పేలుళ్ళ కేసులో అక్రమంగా ఆయుధాన్ని కలిగివున్నాడన్న నేరంపై సంజయ్ దత్‌కు ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ కేసులో పరిస్థితులు, నేర స్వభావం తీవ్రంగా ఉన్నందున సంజయ్ దత్‌ను స్వేచ్ఛగా బయటకు విడిచిపెట్టలేం. ఈ కేసులో టాడా కోర్టు సమర్పించిన ఆధారాలు దత్‌కు శిక్షను ఖరారు చేయడానికి సబబుగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు దత్ యోచిస్తున్నట్లు తెలిసింది. పేలుళ్ల సమయంలో 9 ఎంఎం పిస్తోలు, ఏకె 56 రైఫిల్‌ను కలిగి ఉన్నాడంటూ నవంబరు, 2006లో టాడా కోర్టు దత్‌ను దోషిగా తేల్చింది. అయితే ప్రస్తుతం అమలులో లేని తీవ్రవాద నిరోధక టాడా చట్టం కింద నేర పూరితమైన కుట్రకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అభియోగాల నుంచి సంజయ్ దత్‌కు విముక్తి ప్రసాదించింది.