Quantcast
Channel: AP2KUWAIT
Viewing all articles
Browse latest Browse all 10

కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ అఫ్జల్ స్వస్థలం సోపోర్‌లో ఘర్షణలు పాక్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు

$
0
0

శ్రీనగర్/హైదరాబాద్, ఫిబ్రవరి 10 : కాశ్మీర్ లోయలో రెండోరోజైన ఆదివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్ గురును ఉరి తీయడంతో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రర్త చర్యగా శనివారం తెల్లవారు జామునుంచే భద్రతను కట్టుదిట్టం చేసి, కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

అఫ్జల్ గురు స్వస్థలం సోపోర్ పట్టణం, బారాముల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అల్లరిమూకలపై లాఠీచార్జీ జరిపారు. భారీగా పోలీసులు మోహరించారు.

కాగా ఆఫ్జల్ గురుకు ఉరి తీయడంతో పాకిస్తాన్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు నిరసనలు చేపట్టాయి. భారత్ కోర్టులు న్యాయాన్ని చంపేశాయని, అఫ్జల్‌కు న్యాయం జరగలేదని ముస్లిం నేతలు ఆరోపించారు.

శనివారం పలు చోట్ల ఆందోళనలు
అఫ్జల్ ఉరి వార్తతో అతడి స్వస్థలం సోపోర్ పట్టణం, బారాముల్లాలోనూ ఆందోళనకారులు అల్లర్లకు ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరిపి చెదరగొట్టారు. నలుగురుకి బుల్లెట్ గాయాలయ్యాయి. పలు ప్రాంతాల్లో తలెత్తిన ఘర్షణల్లో 23 మంది పోలీసులు సహా 36 మందికి గాయాలయ్యాయి. ఇక, న్యూస్ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని పోలీసు అధికారులు కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు. జమ్మూలో 144 సెక్షన్ విధించారు.

కాగా, అఫ్జల్ గురు మరణం నేపథ్యంలో నాలుగు రోజులు సంతాప దినాలుగా పాటించాలని మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ఆధ్వర్యంలోని హురియత్ కాన్ఫరెన్స్ పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పీడీపీ అఫ్జల్‌ను ఉరితీయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.


Viewing all articles
Browse latest Browse all 10

Trending Articles