Image may be NSFW.
Clik here to view.
↧
Image may be NSFW.
Clik here to view.
తమిళ వార పత్రిక జూనియర్ విగటన్‌కు ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరుణానిధి వారసత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌కు చెందిన వర్గీయులు ఆమె ఇంటిపై రాళ్లు రువ్వడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.
మరోవైపు.. డీఎంకే నేత ఎంపీ తిరుచ్చి ఎన్.శివ గృహ శుభకార్యానికి ఖుష్బూ హాజరయ్యారు. ఆమె తిరుచ్చిలోని ఒక హోటల్‌లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు డీఎంకే కార్యకర్తలు ఆ హోటల్‌పై చెప్పులతో దాడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.