↧
మొదట్లో గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జున అంటే అమ్మాయిల్లో క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఆ క్రేజ్‌ను మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. యువరాజు దగ్గర్నుంచి వరుసగా టీనేజ్ అమ్మాయిలు మహేష్ బాబు చిత్రం విడుదలవుతుందంటే దానిని చూసేందుకు ఎగబడుతుంటారు.
ఇప్పటికీ అదే పరిస్థితి. కాకపోతే తాజాగా ప్రభాస్ హీరోగా విడుదలయిన మిర్చి చిత్రం చూసేందుకు పెద్ద ఎత్తున అమ్మాయిలు వస్తుండటం చూస్తే, ప్రభాస్ కు అమ్మాయిల ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. మహేష్ బాబుకు ప్రభాస్ పోటీ అని అనుకోవచ్చా… వెయిట్ అండ్ సీ.